16-12-2024 12:59:37 AM
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వ తప్పిదాలపై సీఎం రేవంత్‌కు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖ రాస్తే బాగుండేదని ఎమ్మెల్యే వివేకానంద సూచించారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖను కేసీఆర్‌కు పంపారనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సీఎంల పనితీరు బాగాలేకపోతే పీసీసీ చీఫ్‌లు ప్రశ్నించే వారని, వారి బాటలోనే మహేశ్‌కుమార్ నడవాలని సూచించారు. రేవంత్ తప్పిదాలకు కాంగ్రెస్ మరో 20 ఏళ్లు అధికారానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలకు ఆ పార్టీ నేతలే కారణమని ఆరోపించారు.
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌లోకి మార్చిన ఘనత కేసీఆర్‌దేనన్న సంగతి పీసీసీ చీఫ్ తెలుసు కోవాలన్నారు. ఘట్కేసర్ ప్రాథమిక సహకార సొసైటీలో ఒక్క రైతుకూ రుణమాఫీ కాలేదని.. వారికి మాఫీ చేయించి అసలైన పీసీసీ చీఫ్ అని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలోంచి పుట్టింది నిజమైన తల్లి అని.. గెజిట్ ద్వారా వచ్చింది కాదన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ రాసిన లేఖ చిత్తు కాగితంతో సమానమన్నారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్న రేవంత్ తీరును మహేశ్‌గౌడ్ ప్రశ్నించాలన్నారు. కేటీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టాలని చూసినా బీఆర్ ఎస్ ప్రజల తరుపున పోరాడుతుందని స్పష్టం చేశారు.