30-09-2025 01:45:46 AM
రుద్రంపూర్లో ఏటీసీని ప్రారంభించిన ఎమ్మెల్యే..
కొత్తగూడెం, సెప్టెంబర్ 29, (విజయక్రాంతి ):వృత్తివిద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులు సర్టిఫికెట్లకోసం కాకుండా, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునే దిశగా శ్రమించాలని, అప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. చుం చుపల్లి మండలం రుద్రంపూర్ ఏరియా, 4 ఇంక్లైన్లో అధునాతన సాం కేంతిక కేంద్రం (ఏటీసీ)ని సోమవారం అయన ప్రా రంభించారు.
అనంతరం జరిగిన సభలో కూ నంనేని మాట్లాడుతూ, వృత్తివిద్యను అభ్యసించే విద్యార్థుల సామర్ధ్యాలు పెం చేందుకు ఏటీసీ లు దోహదపడతాయని, గ్రామీణ ప్రాంతాల యువతకు, విద్యార్థులకు ఏటీసీలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఐటిఐలను ఏటిసీలుగా మారుస్తూ, విద్యార్థులను టెక్నాలజీ రంగంలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇది నైపుణ్య శిక్షణ విస్తరణలో కీలకమైన దశ అని అభినందించారు. ఏటిసీల ద్వారా యువతకు పారదర్శకమైన శిక్షణ అయిందించడం ద్వారా,
రాష్ట్రము సాంకేతిక (టెక్నాలజీ) హబ్ గా అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఇట్టి అవకాశాన్ని, యువకులు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్, వట్టికొండ మల్లికార్జునరావు, నాయకులూ తోట రాజు, ప్రిన్సిపాల్ గొనెల రమేష్, సిబ్బంది, అధికారులు శోభన్ బాబు, బి రాము, నర్మద తదితరులు పాల్గొన్నారు.