14-09-2025 01:00:10 AM
సిద్దిపేట, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): గ్రూప్ వన్ పరీక్షలో జరిగిన అవకతవకలపై తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచే టని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డి మాండ్ చేశారు. శనివారం సిద్దిపేటలో ఏ ర్పాటుచేసిన జాబ్ మేళాలో ఆయన మా ట్లాడారు. మంత్రులు, అధికారులు స్వయం గా లక్షల రూపాయలు లంచం అడిగారం టూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
సీఎం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడని ఆరోపించారు. రాహుల్‌గాంధీతో అశోక్‌నగర్‌లో ఇచ్చిన హామీని తుంగలో తొ క్కారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు నాలుగువేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రి యాంక గాంధీతో హుస్నాబాద్ సభలో చె ప్పించారని, అది ఏమైందని ప్రశ్నించారు.
సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేసి వెయ్యి మందికి ఉద్యోగం కల్పించాలనే ఆశయాన్ని ఈ ప్రభుత్వం నిర్వేదం చేసిందన్నారు. నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీలో పోరాటం చేస్తా మంటూ హామీ ఇచ్చారు. అనంతరంచింతమడక గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.