19-11-2025 12:00:00 AM
రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్
మహబూబ్ నగర్ టౌన్, నవంబర్ 17: తోటి వారికి సహాయం చేయడం గొప్ప విషయమని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ అన్నారు. మంగళవారం ఏనుగొండ రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమంలో కీర్తిశేషులు పంతులు సుశీలమ్మ నారాయణరెడ్డి జ్ఞాపకార్థంగా సన్నిధి విద్యార్థులకు యూనిఫామ్ కిట్లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మా పిల్లలకి సుశీలమ్మ నారాయణరెడ్డి జ్ఞాపకార్ధికంగా యూనిఫామ్ కిట్లు అందజేయడం చాలా సంతోషం అన్నారు.
యూనిఫామ్ కిట్ల ధర దాదాపుగా రూ 40 వేల విలువైన సామాగ్రి అందించారు. ఉమామహేశ్వర్ రెడ్డి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ సన్నిధిలో ఉన్న పిల్లలు అనాధలు కాదు మీ అందరికీ మేము ఉన్నాం. మీరు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. కీర్తిశేషులు సుశీలమ్మ నారాయణరెడ్డి, మా తల్లిదండ్రులు జ్ఞాపకార్థకంగా యూనిఫామ్ కిట్టు అందజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, కుటుంబ సభ్యులు,రెడ్ క్రాస్ మేనేజర్ నరసింహ, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.