19-11-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 18 (విజయ క్రాంతి) : మన సంస్క్రుతి, సాంప్రదాయం, సనాతన ధర్మమే భారతదేశానికి బలమని, మన మట్టిలోనే ఆ బలం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భారతదేశ ఐక్యతను విచ్చిన్నం చేసేందుకు పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశాలు కుట్ర చేస్తున్నాయని అన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నెహ్రూ యు వ కేంద్రం మేరా భారత్ ఆధ్వర్యంలో “సర్దార్@150 యూనిటీ మార్చ్ నిర్వహిం చారు.
ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ సర్దార్ పటేల్ స్పూర్తి తో నరేంద్రమోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అందరం ఐక్యంగా ఉంటూ విచ్చిన్న శక్తుల ఆట కట్టించి దేశాన్ని ఐక్యంగా ఉంటూ అభివ్రుద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కు టుంబ రాజకీయ వారసత్వ రాజకీయాలతో దేశానికి ప్రమాదమని పేర్కొన్న కేంద్ర మం త్రి యువత రాజకీయాల్లోకి రావాల్సిన వచ్చి రాజకీయ సమీకరణలను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
మన కుటుంబంలో విబేధాలుంటే. పక్కను న్న వాళ్లు ఆ విబేధాలను తమకు అనుకూలంగా మార్చుకుని లాభం పొందాలనుకుం టారని, అలాగే మన దేశం ఐక్యంగా లేకపోతే... పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ వం టి ఉగ్రవాద దేశాలు మనలోని విబేధాలను వాడుకుని భారత దేశ ఐక్యతను దెబ్బతీసి విధ్వంసం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు.
2047లో భారత్ ను అన్ని విధాలా అభివ్రుద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహర్నిశలు క్రుషి చేస్తున్నారని తెలిపారు. నేటి యువతకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ఆదర్శమని, ఆయనను స్పూర్తిగా తీసుకోవాలన్నారు. పటేల్ స్వార్ధంగా ఆలోచించి ఉంటే 560 సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యే అవకాశమే ఉండేది కాదని, పటేల్ లేకుంటే తెలంగాణ పాకిస్తాన్‌లో భాగమయ్యేది లేదా శ్రీలంక మాదిరిగా స్వ తంత్య్ర దేశమయ్యేదన్నారు. శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలు ఏ విధంగా బిచ్చ మెత్తుకుంటున్నాయో, ఏ విధంగా ఉగ్రవాదానికి, అరాచకాలకు బలైపోతున్నాయోనని అన్నారు.
ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా, ఆర్ధికంగా, సామాజికంగా అగ్రభా గాన దూసుకెళుతున్నామంటే అది సర్దార్ పటేల్ చొరవేనని తెలిపారు. భారత దేశ ఐక్యత కోసం తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మహనీయుడు సర్దార్ వల్లభాయిపటేల్ అని అన్నారు. తెలంగాణకు స్వాతంత్య్రం రా కుండా స్వతంత్య్ర రాజ్యంగా ఉంటే భారతమాత కడుపులో కేన్సర్ ఉన్నట్లేనని ప్రక టించి ‘ఆపరేషన్ పోలో’ పేరుతో నిజాం కు ట్రలను భగ్నం చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ పటేల్ మనందరికీ ఆరాధ్యుడన్నారు.
దేశంలో ఆధునిక సివిల్ సర్వీ సెస్ వ్యవస్థను స్థాపించడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయనలోని ఆలోచనలు, ఆశయాలను, క్రమశిక్షణ, దేశభక్తిని ఈనాటి యువత అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా ఇంఛార్జీ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేశ్, అదనపు కలెక్టర్ నగేశ్, నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి రాంబాబు పాల్గొన్నారు.