calender_icon.png 23 May, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేఖలు రాసి దులుపుకోవడం కాదు

23-05-2025 12:33:10 AM

  1. బుల్లెట్ దిగిందా? లేదా? చూడండి
  2. కరీంనగర్-తిరుపతి రైలు వారానికి  నాలుగుసార్లు నడిచేలా చర్యలు తీసుకుంటా
  3. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, మే 22 (విజయక్రాంతి): ‘గతంలో బీఆర్‌ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతీదానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు.. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతుంటే.. ఇదంతా మావల్లే జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారు. మాటలు కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? చూడాలి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేష న్లను గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కరీంనగర్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవానికి బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి హాజరయ్యారు.

ఈ సంద ర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎవ రి హయాంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెం దాయో అందరికీ తెలుసునని.. అందుకు కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణే ఉదాహరణ అని చెప్పారు. అతి త్వరలోనే జమ్మి కుంట రైల్వే స్టేషన్‌ను అమృత్‌భారత్‌లో చేర్చి ఆధునీకరిస్తామన్నారు.

కరీంనగన్ నుం చి హసన్‌పర్తి వరకు 61 కిలోమీటర్ల నూతన రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తి చేసి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా తయారు చేశామన్నారు. ఈ నూతన లేన్ నిర్మాణానికి రూ.1,480 కోట్లు అవసరమని డీపీఆర్‌లో పేర్కొన్నారని, దీనిపై త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పా రు.

కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతీరోజు రైలు నడపాలని తనతోపాటు మంత్రి పొ న్నం ప్రభాకర్ సైతం లేఖలు రాశారని, అయితే రద్దీ, సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడలేదన్నారు. వారానికి రెండుసార్లు నడుస్తున్న ఈ రైలును వారానికి నాలుగుసార్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల వ్యయంతో 1,350 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరిస్తున్నామని, వీటిలో రూ.2 వేల కోట్ల వ్యయంతో ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మోదీ పాలనలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, గత 11 ఏళ్లలో తెలంగాణలో 20కి పైగా ప్రాజెక్టులు.. 2,298 కిలోమీటర్ల మేర పనులు చేపట్టమన్నారు.

ఒక్క తెలంగాణలోనే రూ.42,119 కోట్ల విలువైన రైల్వే పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయించిమని తెలిపారు. వచ్చే నెలాఖరులోగా ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో ఒక లేన్‌ను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ముంబై, షిరిడీలకు రైలు ప్రారంభించాలి

మంత్రి పొన్నం ప్రభాకర్

అమృత్ భారత్ పథకంలో భా గంగా దేశంలోని 103 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం సంతోషంగా ఉంద ని, తెలంగాణ నుంచి కరీంనగర్, వరంగల్, బేగంపేట రైల్వేస్టేషన్లను పున రాభివృద్ధి చేసి, ప్రారంభించి నందుకు అభినందనలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మమత బెనర్జీ రైల్వే శా ఖ మంత్రిగా, తాను ఎంపీగా ఉన్నప్పు డు ఈ స్టేషన్‌ను మార్పు చేయడం జరిగిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికుల సౌకర్యా ర్థం అధునాతన సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసుకోవడం తప్ప నిసరి అని పేరొన్నారు.

కరీంనగర్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కరీంనగర్ వెళ్లే రై లు వారానికి రెండు రోజులు మా త్రమే నడుస్తోందని, దాన్ని ప్రతిరోజూ లేదా వారానికి నాలుగు రోజులైనా నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరినట్టు చెప్పారు. రైల్వేస్టేషన్లలో ఫెర్టిలైజర్ లో డింగ్, అన్ లోడింగ్ హమాలీ సమస్యలను తొలగించామని కోరారు. కరీంన గర్ నుంచి ముంబై, షిర్డీలకు రైలు ప్రా రంభిస్తే అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు.