calender_icon.png 28 September, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాన వెలిసింది !

22-09-2025 12:00:00 AM

వాన వెలిసింది..

అడవి తేరుకున్నది

పచ్చని పసిరికల పులకింతలతో

నీటి బిందువులు చక్కగా నవ్వాయి..

పచ్చిక బయళ్లు కొత్త గాలిని పీల్చుకున్నాయ్..

కారుమబ్బుల జలదరింతతో

ఆకాశం ఒళ్లు విరుచుకున్నది..

కుందేలు పిల్లలు చిత్తడిలో 

పరుగులు పెడుతున్నాయ్..

ఉడుత పిల్లలు నానిన చెట్ల కొమ్మలపై 

జారుడుబండ ఆడుతున్నాయ్..

రామచిలుక రెక్కలు విదిల్చి రివ్వుమంది..

కొండ కోనల నుంచి జలపాతం దుంకింది..

వాద్యకారులను మించిన సంగీతమందిస్తున్నది..

చిటారు కొమ్మన పక్షిగూడు 

చలికి గడగడ వణుకుతున్నది..

అప్పుడే.. గూటిలోకి వచ్చిన గిజిగాడు 

తడిసి ముద్దయి ఒద్దికగా కూర్చున్నాడు..

దూరపు కొండల నుంచి 

సూరీడు నునువెచ్చని కిరణాలను పంపుతున్నాడు..

వెలుగులు విరజిమ్ముతున్నాడు..