calender_icon.png 28 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యుడు ఆకాశాన్ని..

22-09-2025 12:00:00 AM

సూర్యుడు ఆకాశాన్ని బద్దలు కొట్టేశాడు,

నది సైతమూ తన ఒడ్డులను కొట్టేసింది,

ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక!

సముద్రమూ పెద్దరాతిబండలనూ 

ఢీకొట్టి దాటి విస్తరిస్తోంది,

ఆపై చంద్రుడిని అసలు లెక్కజేయకుండా 

దూరంగా లాగి పడేస్తూ

‘స్థిరంగా ఉండడమనేది నీకు కాదు సుమా..’ 

అని నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తోంది

ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక!

కృష్ణవిహంగం (నా ప్రగాఢప్రేమానుభూతిని) 

వాతావరణంలో నింపేస్తోంది..

ఈ వసంతకాలాన-పచ్చికబయళ్లు వాటి నీడలతో 

పచ్చికబయళ్లపైనే పడిపోతున్నాయి

ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక!

ప్రజలు వీధిలో నడుస్తున్నారు, నవ్వుతున్నారు,

నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక

క్రిందుగా,సుదూరంగా నదీనౌకలు..

సంతోషంగా ఉన్మత్తంగా ‘హుట్.. హుట్‌” 

శబ్దాలతో ప్రవాహంలో సాగుతున్నాయి

ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక !

(ఆంగ్లమూలం: జెన్నీ జోసెఫ్)