calender_icon.png 1 February, 2026 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐవిజన్ యూత్ పార్లమెంట్ గ్రాండ్ ఫినాలే

01-02-2026 12:07:49 AM

  1. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు
  2. పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి

సికింద్రాబాద్ జనవరి 31 (విజయ క్రాంతి): పాఠశాల విద్యార్థుల కోసం రూ పొందించిన సృజనాత్మక, వినూత్న పౌర విద్యా కార్యక్రమం ఐవిజన్ యూత్ పార్లమెంట్ 2025 గ్రాండ్ ఫినాలే  హైదరాబా ద్‌లోని బంజారా హిల్స్, బీజేఆర్ భవన్లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్  జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మార్గ దర్శకత్వం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ,గౌరవ అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్  మాట్లాడుతూ పాల్గొన్న విద్యార్థులను భవిష్యత్ నాయకులు, రాయబారులు అని అభివర్ణించారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు దేశం మరియు రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించే అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థలని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అనుభవాత్మక విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, రాజకీయాల నాణ్యతను మెరుగుపరచడానికి యువత  పాల్గొన డం అత్యవసరమన్నారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో, జిల్లా విద్యాధికారి రోహిణి, ఇక్షణా మార్కెటింగ్ ప్రతినిధులు అంజలి గుప్తా, అంకుర్ గుప్తా, రోటరీ లేక్ డిస్ట్రిక్ట్ ప్రతినిధులు రోటేరియన్లు సునీల్ సరాఫ్, రాజ్ శేఖర్ అలాగే స్పాన్సర్లు సహకారంతో నిర్వహించబడింది అన్ని తెలియజేశారు.