30-04-2025 12:00:00 AM
కోదాడ, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిస్తే ఖమ్మం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తానని ఖమ్మం పట్టణ నివాసి కోవెలమూడి జగదీష్ మొక్కుకున్న విషయం తెలిసిందే. మొక్కు తీర్చడం కోసం రెండో రోజు పాదయాత్ర కోదాడకు చేరుకోవడంతో కోదాడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని శైలేశ్వరావు ఆధ్వర్యంలో జగదీష్ కు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. శ్రీనివాసరావు, శోభన్ బాబు, రమేష్, సురేష్, నరేష్ రెడ్డి, రాంబాబు, రామారావు, నాగేశ్వర్రావు, సరిహద్దుద్దీన్, సూర్యనారాయణ, రవింద్ర హనుమంతరావు, అశోక్, జానిమియా, ఆదినారాయణ, హబీబ్, లక్ష్మీ నాగేశ్వర రావు, నరసింహారావు తదితరులు ఉన్నారు.