15-11-2025 07:37:04 PM
చేగుంట (విజయక్రాంతి): టిఆర్ టిఎఫ్ చేగుంట మండల అధ్యక్షులుగా కే జగన్ లాల్, ప్రధాన కార్యదర్శిగా దేవరాజ్ ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక పట్ల టిఆర్ టిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు మెంగర్తి ప్రణీద్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ప్రణీద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉద్యమ స్పూర్తితో ముందుకు టీ అర్ టీ ఎఫ్ నడుస్తుందని, మండలం ఉన్న ఉపాధ్యాయ మిత్రులంతా, టిఆర్ టిఎఫ్ ను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేసారు. అధ్యక్షులు జగన్ లాల్ మాట్లాడుతూ మాపై నమ్మకముంచి భాద్యతలు అప్పగించినందుకు, జిల్లా అధ్యక్షులకు, మాకు సహకరించిన, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉపాధ్యాయుల శ్రేయస్సుకై, తమ వంతు భాద్యత నెరవేరుస్తామని హామీ ఇచ్చారు, జిల్లా కౌన్సిలర్ లుగా వి వెంకన్న, అబ్దుల్ రషీద్, శ్రీనివాస్ ఎన్నికయ్యారు.