calender_icon.png 8 November, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోకిల రైతు వేదికలో కిషోర్ బాలికల సమావేశం

08-11-2025 07:15:13 PM

శంకర్ పల్లి: శనివారం మోకిలా రైతువేదికలో కిషోర్ బాలికల మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 100 మంది కిషోర్ బాలికల సంఘాల ప్రతినిధులు సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంవీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ భాస్కర్, మోకిలా పీఎస్పీ ఎస్సై పద్మ మాట్లాడుతూ... ఆడపిల్లలపై జరుగుతున్న అరాచకాలు గురించి మాట్లాడడం ఆడపిల్లలందరూ చదువుకొని ఎదగాలి పై స్థాయిలో ఉండాలని గట్టిగా నిలబడి సాధించాలి ఆడపిల్ల తన గోల్ చేరుకునే వరకు చదువులకు ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువును ఆపకూడదు అని అన్నారు.

ఆడపిల్లల లైంగిక వేధింపుల నిరోధానికి రక్షణకు పిఓసిఎస్ఓ చట్టం ఉందని వివరించారు. ఏపిఎం రవీందర్ మాట్లాడుతూ ఆడపిల్లల సంఘాలతో ప్రభుత్వం స్నేహ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అందులో మీరంతా పాలు పంచుకోవాలని మేము ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని చెప్పారు. టీఏఎస్ఎస్ లీడర్స్ మాట్లాడుతూ మా నినాదం ప్రమాణత్వసాధన ఆడపిల్లలపై జరిగే అన్ని రకాల హింసలు ఇక చాలు అని సమాజానికి తెలియజేయడం అలాగే ప్రభుత్వాల నినాదాలతో మార్పులు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ తెలంగాణ ఆడపిల్లల మానవత్వ సమైక్య స్టేట్ కమిటీ లీడర్ మానస, భవ్య టంగుటూరు హాస్పిటల్ డాక్టర్  పాల్గొనడం జరిగింది. ఎంఈఎఫ్ కార్యకర్తలు టీ మంగా ఎం మంగ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.