calender_icon.png 8 November, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగేశ్వరి అధ్యాపకులు కుందేటి సత్యనారాయణకు రెండు బంగారు పతకాలు

08-11-2025 07:16:26 PM

కరీంనగర్ (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో వాగేశ్వరి డిగ్రీ & పీజీ కళాశాల తెలుగు అధ్యాపకులు కుందేటి సత్యనారాయణ రెండు బంగారు పతకాలను గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బివిఆర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించడం సత్యనారాయణ ప్రతిభ, శ్రమ, క్రమశిక్షణ, విద్యాపట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని తెలిపారు. ముఖ్యంగా తెలుగు అధ్యాపకుడిగా విద్యార్థుల్లో భాషా పట్ల ఆసక్తి పెంపొందిస్తూ, బోధనలో నాణ్యతను పెంచుతూ, అనేక మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఆయనతో పాటు కళాశాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ రత్న గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ సతీష్ గౌడ్, లింగమూర్తి, వైస్ ప్రిన్సిపల్ చెన్నమల్ల చైతన్య, సీనియర్ అధ్యాపకులు వెంకట్ రెడ్డి, రమణ చారి, ప్రసాద్, తదితరులు సత్యనారాయణను అభినందించారు.