08-11-2025 07:18:27 PM
జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకుల వినతి..
బోథ్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, బోథ్, సోనాల, బజార్హత్నూర్, గుడిహత్నూర్ మండలాల్లో ఎర్ర ఇసుక లేనందున ఇచ్చోడ మండలం బాబ్జిపేట గ్రామంలో కడెం వాగు పరివాహక ప్రాంతం నుండి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షాకి శనివారం బోథ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల చంటి, చట్ల ఉమేష్, అచ్చుతానంద రెడ్డి విన్నవించారు.
స్పందించిన కలెక్టర్ ఆర్డీవో తో ఇసుక సరఫరాకు అంతరాయం లేకుండా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు అందించవలసిందిగా ఆదేశించారని నాయకులు పేర్కొన్నారు. ఇచ్చోడ మండల ఇన్చార్జి తాసిల్దార్, సర్వేయర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం బాబ్జిపేట ప్రాంతంలోని ఇసుక రీచ్ లను పరిశీలించి, ఫారెస్ట్, జిల్లా కలెక్టర్ లకు వాస్తవ పరిస్థితులను తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో కేవలం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎంపిడివో, తాసిల్దారుల అనుమతితో ఇసుక సరఫరా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.