08-11-2025 07:22:22 PM
చేపల వేటకు ఫైర్ సిబ్బంది
విధులకు హాజరు కానీ సిబ్బందిపై చర్యలకు వెనకాడుతున్న అధికారులు..?
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రమాదాలు జరిగినప్పుడు ఆపద సమయంలో రక్షించి ప్రజలకు మనోధైర్యం కల్పించాల్సిన ఫైర్ అధికారులు, సిబ్బంది విధులను సక్రమంగా నిర్వర్తించకుండా డుమ్మా కొడుతూ.. విలాసాలకు తిరుగుతున్నారనీ జోరుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో మరిపెడ, డోర్నకల్ రెండు ఫైర్ స్టేషన్లకు ఒక్కరే ఫైర్ అధికారి ఉండడంతో సమస్యలు జటిలమవుతున్నాయి.
ఖమ్మం నుండి డోర్నకల్ కు అప్ అండ్ డౌన్ జర్నీకే సమయం సరిపోతుంది. ఒక్కచోట ఫైర్ అధికారిగా చేయడానికి సతమతమవుతున్న అధికారికే మరోచోట మరిపెడ స్టేషన్కు సైతం ఇన్చార్జి అధికారిగా బాధ్యతలు ఇవ్వడంతో సదర్ అధికారి రెండు స్టేషనులను పర్యవేక్షించి సిబ్బందితో పని చేయించడంలో విఫలమవుతున్నారు. పేరుకే ఫైర్ అధికారిగా ఉంటూ.. అక్కడ.. ఇక్కడ.. నేనే ఉంటా.. జిల్లా అధికారికి చేదోడు వాదోడుగా ఉంటూ.. రెండు స్టేషన్లో మామ అనిపిస్తున్నాడు. ఈ అధికారి తీరును నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. సందు దొరికితే అధికారికి తగిన బుద్ధి చెప్పడానికి సంసిద్ధమవుతున్నారు.