14-10-2025 12:00:00 AM
నిజామాబాద్ అక్టోబర్ 13 (విజయ క్రాంతి) : నగరంలో రాత్రివేళల్లో రోడ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆరుగురు మహిళలకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో యువతను ఆకర్షించేలా వ్యవహరిస్తూ వ్యవహరిస్తూ వారిపై దాడులు చేస్తూ దుర్భాషలాడుతూ వెళ్లే వారి పట్ల అసభ్యంగా వ్యవహరిస్తు శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ మేరకు నిజామాబాద్ కామారెడ్డి భైంసా ప్రాంతాలకు చెందిన ఆరుగురు మహిళలపై సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని సోమవారం స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా ఒకరికి ఒకరోజు, మిగిలినవారికి రెండురోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే.. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్హెచ్వో హెచ్చరించారు.