04-01-2026 12:00:00 AM
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ గత ఏడాది ‘కిష్కింధపురి’ సినిమాతో మెప్పించారు. ఆయన నటించిన మరెన్నో సినిమాలు చాలా కాలంగా వివిధ దశల్లో ఉన్నాయి. ఆ సినిమాలన్నీ ఈ ఏడాది విడుదలవుతున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ హీరో నటిస్తున్న సినిమాల్లో థ్రిల్లర్ మూవీ ‘హైందవ’ ఒకటి. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్నారు. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేశ్ చందు నిర్మిస్తున్నారు. శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ తర్వాత చిత్రబృందం తాజాగా కీలకమైన నాలుగో షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసింది. అయితే, శనివారం కథానాయకుడు సాయి శ్రీనివాస్‌కు పుట్టినరోజు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్ర నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఫెరోషియస్ మాస్ లుక్‌లో సాయి శ్రీనివాస్ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అందిస్తుండగా, హరీశ్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ పర్యవేక్షిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
‘టైసన్ నాయుడు’ యాక్షన్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. శనివారం హీరో శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీనివాస్ తుపాకీ గురిపెట్టి నిల్చున్న ఈ పోస్టర్ అదిరిపోయింది. ఈ సినిమాకు ముఖేశ్ జ్ఞానేశ్, అనిత్ డీవోపీగా వ్యవహరిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. కోటగిరి వేంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
పవర్‌ఫుల్ రామమ్
సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘రామమ్’. లోకమాన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిత్రాలయం బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి సాయి శ్రీనివాస్ షాడోతో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎం ఎబినెజర్ పాల్ సంగీతం సమకూర్చుతుండగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.
డీవోపీ - జ్ఞానశేఖర్ వీఎస్ కాగా, ఎడిటింగ్ బాధ్యతలు కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాహి సురేశ్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.