calender_icon.png 23 December, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమలాపురం గ్రామాన్ని మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేస్తా

23-12-2025 12:55:03 AM

తుళ్లూరి నిర్మల కుమారి

ఎర్రుపాలెం డిసెంబర్ 22(విజయక్రాంతి): జమలాపురం గ్రామాన్ని రా ష్ట్రంలోనే మోడల్ గ్రామపంచాయతీగా అభివృద్ధి చేస్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తుళ్లూరి నిర్మల కుమారి పేర్కొన్నారు. సోమవారం నాడు పంచాయతీ కార్యాలయం నందు జరిగిన జరి గిన కార్యక్రమంలో నూతన సర్పంచిగా ప్రమాణస్వీకారం చేశారు. తదనంతరం మాట్లాడుతూ జమలాపురం గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తానని, ప్రజలకు కావలసిన అవసరాలను తీరుస్తానని, గ్రామాభివృద్ధిలో ప్రజలందరినీ భాగ స్వామ్యం చేస్తూ గ్రామాభివృద్ధికి పాల్పడతానని వివరించారు. గ్రామ ప్రజలు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.

జమలాపురం గ్రా మం రాష్ట్రంలోనే పేరుగాంచిన గ్రామానికి సేవ చేసే భాగ్యం తనకు కల్పించారని వివరించారు. జమలాపురం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని, గ్రామానికి ఎంతో చరిత్ర ఉందని, గ్రా మాన్ని ఆధ్యాత్మిక గ్రామంగా అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే గ్రామాన్ని మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండల సభ్యులు, తుళ్లూరు కోటేశ్వరరావు, మిరియాల శ్యాంప్రసాద్, బుద్ధ వెంకటకృష్ణ, భూక్య గోపి, గద్దల సత్యనారాయణ, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.