03-01-2026 04:53:19 PM
హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో శనివారం నాడు ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. జమ్మలమడుగు(Jammalamadugu MLA) భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ పరీక్షల్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు డీఅడిక్షన్ సెంటర్ కు తరలించారు. సుధీర్‌రెడ్డితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.