30-04-2025 08:15:09 PM
ప్రిన్సిపాల్ ఎం.రమేష్..
మందమర్రి (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో పట్టణంలోని చైతన్య పాఠశాల విద్యార్థులు 45 మంది పరీక్షకు హజరు కాగా వంద శాతం ఫలితాలు సాధించి విజయధుంభి మోగించారని పాఠశాల ప్రిన్సిపల్ ఎం.రమేష్ అన్నారు. పాఠశాలలో బుదవారం ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యార్థులు మిగిలిన పాఠశాలల విద్యార్థుల కంటే అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందంజలో దూసుకుపోతున్నారన్నారు.
పాఠశాల విద్యార్థిని కొండబత్తుల వినూత్న 585 మార్కులతో మండల మొదటి ర్యాంకు, జిల్లాలో మూడవ ర్యాంకు సాధించిందని ఆన్నారు. కొండ బత్తుల నిత్య 574, పెద్ది అధిత్రి 572, మహాలక్ష్మి 570 అత్యధిక మార్కులు సాధించారని అన్నారు. 45 మందితో శత శాతం ఉత్తీర్ణులై విజయం సాధించారని, క్రమశిక్షణతో కూడిన ఒత్తిడి లేని విద్యా, నిష్ణాత్తులైన ఉపాధ్యాయుల ద్వారా ప్రణాళిక బద్ధమైన బోధన, చిన్న తరగతుల నుండే నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా అధ్యాయనంతో ఇటువంటి అద్భుత విజయాలు సాధించగలమని ఆయన స్పష్టం చేశారు.
అద్భుత విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా అత్యద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య, చైర్మన్ మల్లంపల్లి శ్రీధర్, ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ రవి, పదవ తరగతి ఇంచార్జి రవితేజ, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఇంచార్జిలు నూకల సునీత, తిరుమల, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.