calender_icon.png 8 January, 2026 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష భూమి జాతర పోస్టర్ల ఆవిష్కరణ

06-01-2026 05:37:37 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష భూమి జాతర పోస్టర్ లను ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఆవిష్కరించాడు. ఈనెల 11న నార్నూర్ మండలంలోని దీక్ష భూమి కొత్తపల్లి లో జరిగే 47వ గురు కృప, గురు మిలన్ దినోత్సవ మహాసభ జాతరకు బంజారా సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ ఇంచార్జ్ శ్యాం నాయక్, మాజీ జడ్పిటిసి చారులతా రాథోడ్ తో కలిసి ఆయన పోస్టర్ ఉట్నూర్ లో మంగళవారం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.