calender_icon.png 19 November, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ జల అవార్డు సౌత్‌జోన్‌లో జనగామకి ద్వితీయ స్థానం

19-11-2025 12:00:00 AM

జనగామ, నవంబర్ 18 (విజయక్రాంతి):జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ సంచాయ్ జన్ భాగీధారీ కార్యక్రమంలో  సౌత్ జోన్లో జిల్లాకి ద్వితీయ స్థానం సాధించింది.ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో పాటు రూ. కోటి కోట్ల నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ 2025 సెప్టెంబర్ 26న సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.

మంగళవారం రోజున న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు సి ఆర్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్  పురస్కారం అందుకున్నారు. 2024-25 ఆర్ధిక సంవత్సరం లో జల్ సంచాయి జన్ భాగీ దారి (1.0) లో భాగం గా జిల్లా లోని వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయలలో (1)వర్షపు నీటి ఇంకుడు గుంతలు(2)రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ (3) బోర్ వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ (4) పాం పాండ్స్ (5) చిన్న నీటి ఊట కుంటలు (6)కాంటూరు కందకాలు (7) మ్యాజిక్ సోక్ పిట్స్ (8) చెక్ డ్యామ్స్ ఇట్టి పనులు జాతీయ ఉపాధి హామీ పతకం నిధుల తో జిల్లా లోని 281 గ్రామ పంచాయతీ లలో అవసాలలో 30569 పనులను చేపట్టగా భూగర్భ జల నీటి మట్టం పెరిగింది.

తద్వారా త్రాగు,సాగు నీటి ఏడ్డది లేకుండా పోయింది, ఇట్టి పనులను కేంద్ర జల్ శక్తి శాఖ గుర్తించి జిల్లా కు జల పురస్కారం క్రింద ఒక్క కోటి నగదు రూపాయలు ఇచ్చింది 2025-26 ఆర్థిక సంవత్సరం లో జల్ సంచాయి జన భాగీ దారి* 2.0 క్రింద జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 24 జూన్ 2025 రోజన మన జిల్లా మన నీరు అనే నినాదం తో  కలెక్టర్ కార్యాలయం ప్రాంగణం లో తక్కువ ఖర్చు తో వర్షపు నీటి ఇంకుడు గుంత నిర్మణన్ని ప్రారంభించి.

జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు తగు సూచనలు చేస్తూ జిల్లా లోని ప్రతి గ్రామ మండల, జిల్లా, స్థాయి అధికారులకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. తక్కువ ఖర్చు తో వర్షపు నీటి సంరక్షణ గుంతలు ఇప్పటి వరకు 7350 నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే సంవత్సరం మార్చ్ 31 వరకు సుమారు 50000 వర్షపు నీటి సంరక్షణ గుంతలు నిర్మిచాలని కలెక్టర్ జిల్లా లోని అధికారులకు, సామాజిక సంస్థ లకు, ప్రజలకు తెలిపారు. తద్వారా మన జిల్లా లో త్రాగు, సాగు నీటి ఏడ్డది రాకుండా చూడాలిసి బాధ్యత జిల్లా లోని అందరి మీద ఉందన్నారు.జిల్లాకు లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు పట్ల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.