calender_icon.png 19 November, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా...

19-11-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల, నవంబర్ 18 (విజయక్రాంతి) : డ్రగ్స్ రైతు సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని, యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా సన్మార్గంలో నడిచే మంచి భవిష్యత్తు పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ, మంచిర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎస్‌ఆర్‌ఆర్ జూనియర్ కళాశాల, ఆల్ ఫోర్స్, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

విద్యార్థులకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను వివరించారు. విద్యా ర్థులు లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకై నిరంతరం కృషి చేయాలన్నారు. అనంతరం డ్రగ్స్ పై అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అనిత, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ప్రసాద్, ఎక్సైజ్ సీఐ గురవయ్య, ఎక్సైజ్ ఎస్త్స్ర శంకర్, డీ హెచ్ ఈ డబ్ల్యూ కో ఆర్డినేటర్ సౌజన్య, ఎఫ్‌ఆర్‌ఓ ఫర్జానా పాల్గొన్నారు.