19-11-2025 12:00:00 AM
కుభీర్, నవంబర్ 18 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో ఈ నెల 11న ప్రారంభమైన అఖండ హరినామ సప్తాహ మంగ ళవారం ఘనంగా ముగిసింది. తెల్లవారుజామున రుక్మిణివిట్టల విగ్రహాలకు అభిషేకం, పుష్పార్చన, పట్టువస్త్రాల సమర్పణ అనంత రం కన్నుల పండుగగా కాకడ హారతి నిర్వహించారు.
తరువాత ప్రత్యేకంగా అలంకరిం చిన రథంలో స్వామివారిని భజనలు, మేళతాళాలతో పురవీధుల గుండా ఊరేగించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో ఉట్టికొట్టే కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరిగింది.
ఈ జాతరలో మొత్తం 32 క్వింటళ్ల అన్నదానం భక్తులకు పంపిణీ చేయబడింది. కార్యక్రమానికి ముధోల్ మాజీ ఎమ్మెల్యే జీ. విట్టల్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సర్పంచ్ పానాజీ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, ఆలయ కమిటీ చైర్మన్ పెంటా జీ, మున్నూరుకాపుయాదవ సంఘాల అధ్యక్షులు చిమ్మన్ అరవింద్ పాల్గొన్నారు.