22-08-2025 11:29:51 PM
మరిపెడలో అదృశ్యం.. భూపాలపల్లిలో ప్రత్యక్షం
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని శుక్రవారం ఉదయం పారిపోయింది. పాఠశాలలో ఉదయం రోల్ కాల్ చేస్తుండగా కనిపించలేదు. వెంటనే ఈ విషయంపై అప్రమత్తమైన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అనితా దేవి, ఉపాధ్యాయులు ఆమె జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు.
మరిపెడ సిఐ రాజ్ కుమార్ గౌడ్, కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. అదనపు ఎస్సై కోటేశ్వరావు పాఠశాలలోని సీసీ పుటేజీ పరిశీలించి కుటుంబ సభ్యులకు సూచనలు చేయడంతో వారు తమ బందువులును భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ బస్టాండ్లకు బాలిక అచూకి కోసం పంపిచడం జరిగింది. ఈ క్రమంలో బాలిక మధ్యాహ్నం భూపాలపల్లి బస్టాండ్ లో బస్సు దిగుతుండగా బంధువులు గుర్తించడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. పారిపోయిన విద్యార్థినికి మరిపెడ గురుకులంలో చదవడం ఇష్టం లేక పారిపోయినట్లు బంధువులకు చెప్పినట్లు తెలుస్తోంది.