calender_icon.png 5 May, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుడు కేసు పెట్టారని ఎస్పీకి జవాన్ ఫిర్యాదు

05-05-2025 02:31:19 AM

కామారెడ్డి, మే 4 (విజయ క్రాంతి), దేశ రక్షణ కోసం సైన్యంలో చేరిన ఓ జవాన్ కు స్థానికంగా జరుగుతున్న అక్రమాలపై నిలదీయాలని పోరాటం చేసిన పాపానికి తనపై ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించిన ఘనత కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు జవాన్ ప్రస్తుత ఎస్త్స్రగా విధులు నిర్వహిస్తున్న భువనేశ్వర్రావు పై ఏఎస్‌ఐ వెంకటరావు పై జిల్లా ఎస్పీ ఎస్పీ రవిచంద్ర కు ఫిర్యాదు చేయడం కలకలం రేపు తుంది.

గతంలో కూడా కామారెడ్డి లో పనిచేసిన ఎస్పి సింధు శర్మ దృష్టికి ఈ ఘటన పై ఫిర్యాదు చేసిన ట్లు ఆ జవాన్ విజయ క్రాంతి ప్రతినిధి తో తెలిపారు. జుక్కల్ మండల కేంద్రంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రభుత్వ సర్వే నెంబర్ లో పట్టా పాస్ పుస్తకాలు పొంది ప్రభుత్వం ద్వారా రుణమాఫీ తో పాటు స్థానిక బ్యాంకులు రుణాన్ని తీసుకొని ప్రభుత్వం మాఫీ చేయడంతో లబ్ధి పొందిన ఘటనపై జవాన్ అధికారులకు అప్పటి కలెక్టర్కు ఫిర్యాదు చేయడమే తప్పయింది.

సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించగా అక్రమాలు వెలుగు చూసిన విషయం విధితమే. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఒకే సర్వేనెంబర్ పై నెంబర్లతో 200 ఎకరాల వరకు పాస్ పుస్తకాలు పొంది రుణాలు పొందిన విషయం ఆ జవాన్ ఉన్నతాధికారుల ల దృష్టికి తీసుకు వెళ్లడంతో అతని వై కుట్ర పన్నిన బడా నాయకు డు స్థానిక ఎస్‌ఐ పోలీస్ సిబ్బందితో కుమ్మక్కై ఆ కేసు నుంచి బయటపడేందుకు ఓ మహిళ ద్వారా జవాన్ పై ఫిర్యాదు చేయించారు. డ్యూటీలో ఉన్న జవాన్ పై జుక్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా అతని స్కార్పియో వాహనం ఇంటి ఎదుట నిలిపిన పాపానికి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జవాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ ఏ ఎస్ ఐ మీ వద్ద తుపాకీ ఉంది నీ స్కార్పి యో వాహనాన్ని దగ్ధం చేసిన వారు నీకు గుర్తే నీవు వారిని కాల్చివేయి అంటూ వ్యంగ్యంగా మాట్లాడడం జవాన్ గోపి నీ తీవ్రంగా కలిసి వేసింది.

ఈ విషయాన్ని కూడా ప్రస్తుత ఎస్ పి రాజేష్ చంద్ర దృష్టికి తీసుకెళ్లారు. మరి చర్యలు ఏ మేరకుంటాయో, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్త్స్ర ఏఎస్ ఐ లపై విచారణ జరుగుతుం దా...? లేక బడానాయకుల ఒత్తిళ్లకు తాళ్లొగి చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాల్సిందే. ఆర్మీలో పనిచేస్తున్న ఓ జవాన్ చేస్తున్న పోరాటానికి పోలీస్ బాస్ మద్దతు ఉంటుందా లేక ఏలాంటి చర్యలు తీసుకుంటా రో వేచి చూడాల్సిందే.

దేశ రక్షణ కోసం సేవ చేస్తున్న జవాన్ గోపి చేస్తున్న న్యాయపోరాటానికి న్యాయం జరుగుతుందా లేక తప్పుడు కేసు తో జవాన్ గోపి పై చర్యలు తీసుకుంటారా అనే చర్చ కోన సాగుతుంది. కామారెడ్డి జిల్లాలో ఓ జవాన్ చేస్తున్న పోరాటం ఏ మేరకు పోలీస్ బాస్ స్పందిస్తారో వేచి చూడాల్సిందే. జుక్కల్ ఎస్త్స్ర ఏ ఎస్ ఐ ఓ బడా నాయకుడు చేస్తున్న ఆగడాలపై ఎస్పీకి పూర్తి ఆధారాలతో ఆర్మీ జవాన్ గోపి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.