calender_icon.png 25 May, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠ్యపుస్తకాల్లో ‘జయజయహే తెలంగాణ’

24-05-2025 01:47:13 AM

-తెలంగాణ తల్లి చిత్రం కూడా ముద్రణ

-జూన్ 12నుంచి విద్యార్థులకు పంపిణీ

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ, తెలంగాణ తల్లి చిత్రాన్ని ముద్రించారు. 2025 విద్యాసంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాల్లో ఈ చేర్పులు చేయాలని గతేడాదే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో వీటిని ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలకు ఇందుకు సంబంధించిన పాఠ్యపుస్తకాలతోపాటు నోటు పుస్తకాలు చేరుకున్నాయి.