08-08-2025 12:46:33 AM
చొప్పదండి, ఆగస్టు 7 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమ్మత్ నగర్ మాజీ సర్పంచ్ పొత్తూరి బాబు తల్లి గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి పదివేల రూపాయల ఆర్థికసాయం అందజేశారు.
మాజీ సర్పంచ్ సిరిమల్ల చందు ఇట్టి విషయాన్ని జయపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా... మిత్రమండలి సభ్యులచే పొత్తూరి బాబుకు పదివేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు సిరిమల్ల చందు, పోతూరి ప్రభాకర్, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఆల్ ఇండియా రెడ్డి సంఘం అధ్యక్షుడు బండారి శ్రీనివాస్, గుర్రం రాజిరెడ్డి, ఊకంటి శరత్ రెడ్డి, మిత్ర మండలి సభ్యులు, బాధిత కుటుంబీకులు, తదితరులు పాల్గొన్నారు.