08-08-2025 12:44:59 AM
ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వరా !, ఇల్లు ఇవ్వాలని ఎంపీడీఓ కు పిర్యాదు
కోరుట్ల ఆగస్టు 7(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీ లను వేసి ఇల్లు లేని వారిని ఎంపీక చేయాలని సుచించగా ఎంపికలో అవక తవకలు జరిగాయని కోరుతు ఇబ్రహీం పట్నం ఎంపీడీఓ కు గురువారం గోపు లలిత వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలం గోదురు గ్రామంలో ఇల్లు ఉన్న వాళ్లకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని, గ్రామంలో ఇల్లు లేని పేద వారు ఉన్నారని వారికి ఇవ్వకుండా ఇల్లు ఉన్నవారికి ఇచ్చారని, పేదలు కిరాయి ఇంట్లో ఉంటూ కిరాయి కట్టే స్థితిలో లేరని వారికి ఇల్లు మంజూరు చేయాలని కోరామన్నారు