calender_icon.png 26 November, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

26-11-2025 12:10:26 AM

ములకలపల్లి, నవంబర్ 25, (విజయక్రాంతి):ములకలపల్లి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినిలు కబడ్డీ, ఖోఖో క్రీడా పోటీల కు జాతీయ, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వివరాలను ప్రిన్సిపల్ సునీత మంగళవారం విలేకరులకు తెలిపారు. హర్యా నాలో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయస్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు సబ్ జూనియర్ విభాగంలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గొర్ల అంజు శ్రీ ఎంపికైంది.

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పదో తరగతి విద్యార్థిని అఖ్విలా సాయిశ్రీ పాల్గొని ప్రతిభ కనబరిచింది. ములకలపల్లి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన బాలికలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎంపికై క్రీడా పోటీల్లో పాల్గొనడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ సునీత,పిడి, పిఈటి,ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలిపారు.