22-08-2025 02:05:36 AM
ఆర్డర్స్‌ను విడుదల చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేడయంతో పదోన్నతుల ప్రక్రియను అధి కారులు చేపట్టారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు కొత్తగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు (జీహెచ్ ఎం)గా పదోన్నతులు పొందారు. దీనికి సం బంధించిన ఆర్డర్స్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం విడుదల చేశారు.
మేనేజ్‌మెంట్ల వారీగా వివరాలను ప్రకటించారు. మల్టీజోన్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో 53 మం ది, లోకల్‌బాడీ స్కూళ్లలో 437 మంది కలిపి మొత్తం 490 మంది పదోన్నతులు పొందారు. ఇక మల్టీజోన్‌ేొ2 పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో 80 మంది, లోకల్‌బాడీ స్కూళ్లలో 310 మంది కలిపి మొత్తం 390 మంది పదోన్నతులు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 880 మంది ఉపాధ్యాయులు జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందా రు.
పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు పదిహేను రోజులుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. పలు కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను మళ్లీ తిరిగి రీషెడ్యూల్ చేశారు. ఈనెల 26వరకు మొత్తం పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్‌ను విడుడల చేశారు.