21-05-2025 10:06:31 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో 21 మంది హాజరు కాగా 15 మందికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(Shriram Life Insurance Company)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల్లో ఉద్యోగ అవకాశం కల్పించినట్లు జిల్లా ఉపాధి శాఖ అధికారి రజిత తెలిపారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు.