calender_icon.png 22 May, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాజీపేట డీ మార్ట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

21-05-2025 10:09:34 PM

హనుమకొండ (విజయక్రాంతి): కాజీపేటలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపాన ఉన్న డీ మార్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇట్టి వ్యక్తి తెల్లని జుట్టు, తెల్లని గడ్డం కలిగి ఉండి, బ్లూ కలర్ చొక్క, సిమెంట్ కలర్ ప్యాంటు, బ్రౌన్ కలర్ బెల్ట్ ధరించి ఉన్నాడనీ, ఎత్తు 5'5", చామన ఛాయ రంగును కలిగి ఉన్నాడన్నారు. ఇట్టి మరణించిన వ్యక్తి గురించి వివరాలు తెలసినచో  8712685122, 8712509781, 8712685008 కాజిపేట పోలీస్ నంబర్లకు సంప్రదించగలరన్నారు.