22-08-2025 12:28:02 AM
కరీంనగర్/సిరిసిల్ల, ఆగస్ట్21(విజయక్రాంతి): పంచాయతి రాజ్ మరియు గ్రా మీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం పూర్తి అయిన పనులకు ప్రారంభోత్సవం, కొత్త పనులకు భూమి పూ జ కార్యక్రమములను పెద్ద ఎత్తున చేపట్టుటకు గాను పనుల జాతర -2025 ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నిర్వహించనున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురు మామిడి, సైదాపూర్ మండలాలలో , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపిరి నియోజకబర్గము లో, ప్రభుత్వ విప్ అది శ్రీనిబాస్ వే ములవాడ నియోజక వర్గం లో పాల్గొంటా రు. జిల్లాలలోని అన్ని మండాలల పరిధిలోని అన్ని గ్రామాలలో ఒకే రోజు పనుల జాతర -2025 నిర్వహించుటకు జిల్లా యం త్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ యొక్క పనులను ప్రారంభోత్సవాలు,భూమి పూజలు చేయనున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్ పథకం, పంచాయతి రాజ్ ఇంజనీరింగ్, స్వచ్చభారత్ వంటి విభాగాలలో చేపట్టిన, చేపట్టనున్న పనులకు ఈ సందర్భంగా ప్రారంభోత్సవాల, భూమి పూజలు నిర్వహించనున్నారు.
నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్ వాడి భవనాలు, స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ) ద్వారా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్, కమ్యూనిటి సానిటరీ కాంప్లెక్స్, ఇంది రా మహిళ శక్తి ఉపాధి భరోసా క్రింద వ్యక్తిగత ఆస్తుల కల్పన పనులు అనగా పశువుల కొట్టం, కోళ్ళ షెడ్, గొర్రెల షెడ్, పండ్ల తో టలు, వానపాముల ఎరువుల తయారీ, అ జోలా పిట్ నిర్మాణం, జలనిధి క్రింద వాన నీటి సంరక్షణ భూగర్భ జలాలు పెంచే ఫా రం పాండ్, ఊట కుంటలు వంటి పనులకు ప్రారంభోత్సవాలు , భూమీ పూజలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమములో భాగంగా రైతులకు మరియు లబ్దిదా రులకు మంజూ రు ఉత్తర్వులను గ్రామ సభలలో అందజేయనున్నారు.ఉపాధిహామీ పథకంలో ఎక్కువ రోజులు పని చేసిన కూలీలను, దివ్యాంగులను, పారిశుద్య కార్మికులను, హరిత సంర క్షకులను ఈ సందర్భంగా సన్మానించనున్నారు.