17-01-2026 01:50:51 AM
మొయినాబాద్ జనవరి 16(విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రజాపాలన, సంక్షేమ పథకాల అమలు నచ్చి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు యండి అన్వార్ ఖాన్, యండి నూర్ బాయ్ టీపీసీసీ కార్యవర్గ సభ్యులు షాబాద్ దర్శన్,పల్లగుల్ల అశోక్ యాదవ్, సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగ యండి అన్వార్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రజాధరణ పొందుతూ సుస్థిర అభివృద్ధికై పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్న చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు.
మాజీ సర్పంచ్ చేరగు రామ కృష్ణ గౌడ్,కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు గడ్డం వెంకట్ రెడ్డి, ఈగ రవీందర్ రెడ్డి,యాలాల జైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లేష్‌యాదవ్, హన్మంత్ యాదవ్, బేగరి రాజు, కొత్తపల్లి విక్రమ్ రెడ్డి, కమ్మరి యాదగిరి చారి,బండారి చెంద్ర రెడ్డి, యండి మహీబ్ బాయ్ పాల్గొన్నారు.