17-01-2026 01:54:15 AM
మాయావతి పుట్టినరోజున షాద్ నగర్‌లో బహుజన ఆత్మగౌరవ సభ !
షాద్నగర్, జనవరి 16, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని,, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను బిఎస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్ దుయ్యబట్టారు.
బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహన్ జి మాయావతి గారి 70వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా బహుజన ఆత్మగౌరవ సభ షాద్నగర్ లోని సాయిరాజా ఏసీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాయావతి దూత బిఎస్పి పార్టీ సెంట్రల్ సెక్టార్ కోఆర్డినేటర్ అతర్ సింగ్ రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలుమాలలు సమర్పించి నివాళులర్పించారు.
బిఎస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ మాట్లాడుతూ అక్టోబర్ 9న 2025 లక్నోలో సాహెబ్ మన్యవర్ కాన్షీరాం గారి వర్ధంతి 17 లక్షల మంది ర్యాలీ తో బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రాబోతుందని సంకేతం ఇవ్వగా, షాద్‌నగర్‌లో జరిగిన బహెన్ కుమారి మాయావతి గారి 70వ జన్మదిన సందర్భంగా తెలంగాణలో బీఎస్పీ పార్టీ అధికా రంలోకి రాబోతుందని ఈ సభ సాక్ష్యం అన్నారు. సంక్రాంతి పండుగ రోజున ఎగరాల్సిన పతంగులు కాదు, ఆత్మగౌరవ ఎజెండా లైన బీఎస్పీ జెండాలని పిలుపునిచ్చారు.
సంక్రాంతి పండుగ వేళ, బహుజనులు సామాజిక సమానత్వం ఆర్థిక విముక్తి పాలతో బహుజన సంక్రాంతికి షాద్నగర్లో పాలు పొంగిచ్చారని సభను ఉద్దేశించి ఆనందం వ్యక్తం చేశారు, మాయావతి పుట్టినరోజు పురస్కరించుకొని ఏర్పాటుచేసిన బహుజనుల ఆత్మ గౌరవ సభ లో 3500 వందల మంది పాల్గొనడం విశేషమని, తెలంగాణలో బహుజన రాజ్యాధికారానికి షాద్నగర్ సభ సంకేతం పిలుపునిచ్చారు. బిఎస్పి పార్టీ అధికారంలోకి వస్తే దాడులు, హత్యలు, అత్యాచారం చేసే నేరస్తులను ఆరు నెలలు జైల్లో వేస్తామని హెచ్చరించాడు.
ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ సెక్టార్ కోఆర్డినేటర్ అతార్ సింగ్ రావు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల, పేరుతో ఏర్పాటు అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో, బహుజన వాటా ఎందుకు రాలేదన్నారు, అగ్రకులాలో ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పేరుతో బిఆర్‌ఎస్ పేరుతో బిజెపి పేరుతో జెండాలు మారుస్తూ బహుజన్లను కుట్రపూరితంగా అధికారంకు దూరం చేస్తూ అణచి వేస్తున్నాయన్నారు.
బీఎస్పీలో చేరిక
కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తన అనుచరులతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ ఆధ్వర్యంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో దళితులకు ఆత్మగౌరవం లేదన్నారు, దళితులను అధికారం కోసం వాడుకొని, తర్వాత గాలికి వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,
కాంగ్రెస్ పార్టీ చేతి మనకు చూయించి, అధికారం అగ్రకులకిచ్చిందని, బహుజన్ సమా జ్ పార్టీ బహుజనులకు అధికారం ఇవ్వడానికి అంబేద్కర్ సిద్ధాంతంతో ఏర్పాటైన పార్టీ అని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి బీఎస్పీ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. బిఎస్పి ,రంగారెడ్డి జిల్లా మహిళా కన్వీనర్ వావిలాల ఇందుమతి , షాద్ నగర్ అసెంబ్లీ ఇంచార్జి గుండేటి నరసింహ,
షాద్నగర్ అసెంబ్లీ అధ్యక్షులు సొంటె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మణుగురి రాంప్రసాద్‌గౌడ్, ప్రధా న కార్యదర్శి తుప్పరి కుమార్, కార్యదర్శి కొండేటి మహేందర్, కోశాధికారి గాలిపాగ మోజెస్, ఫరుక్ నగర్ మండల అధ్యక్షులు శివగల ఆంజనేయులు, షాద్నగర్ టౌన్ ప్రెసిడెంట్ నీరటి రాజు, కేశంపేట మండల అధ్యక్షులు అబ్బి జగన్, చౌదర్ గూడా మండల అధ్యక్షులు ఆర్. చెన్నయ్య, కొందుర్గు మండల అధ్యక్షులు రాపొల్ రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.