calender_icon.png 24 August, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళంలో జోరు

24-08-2025 01:37:29 AM

కృతిశెట్టి తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. కుర్రకారు మనసుల్లో తిష్ట వేసింది. అలా ఒక్క సినిమాతో యువత హృదయాలను దోచేయడంతో తెలుగులో ఆమె ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. దీంతో అవకాశాలు ఆమె ముందు క్యూ కట్టాయి. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ అంతే వేగంగా వరుస డిజాస్టర్స్ అందుకుంది.

ఇప్పుడు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితేనేం, తమిళంలో మాత్రం ఈ భామ జోరు తగ్గలేదు. వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తోందీ ముద్దుగుమ్మ. కార్తీ, రవిమోహన్, ప్రదీప్ రంగనాథన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నవే కావటం బేబమ్మకు కలిసివచ్చే అంశం. ఇదిలా ఉండగా ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా కృతిశెట్టి చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా వచ్చే నెల 18న రిలీజ్ కానుంది. అలాగే కార్తీ, రవిమోహన్ సరసన నటిస్తున్న సినిమాలపైనా ఇప్పటికే మంచి అంచనాలున్నాయి.