24-08-2025 01:36:34 AM
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది షాలినీ పాండే. ఆ సినిమా తర్వాత తెలుగులో మంచి అవకాశాలొచ్చినా, కథల ఎంపికలో జరిగిన పొరపాట్ల వల్ల అవేవీ ఈ అమ్మడికి కలిసి రాలేదు. తర్వాత బాలీవుడ్‌లోనూ వర్కవుట్ కాలేదు. నిరుడు జునైద్ ఖాన్‌తో చేసిన ఓటీటీ ప్రయత్నమూ బెడిసికొట్టింది.
దీంతో ఓ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోందీ భామ. అయితే ఇప్పుడు షాలినీ.. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇడ్లీకడై’లో భాగమవుతోందట. ధనుష్‌కు చెల్లి పాత్రలో, అరుణ్ విజయ్‌కి భార్య పాత్రలో కనిపించనుందట. హీరోయిన్ కాకపోయినా సినిమాలో షాలినీ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని సమాచారం.