30-08-2025 12:00:00 AM
నిర్మల్ ఆగస్టు 29 (విజయ క్రాంతి): పాత్రికేయులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీడబ్ల్యు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండూరి రవీందర్ వెంకయ్య గారి భూమయ్య డిమాండ్ చేశారు.
శుక్రవారం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏవో సూర్యారావుకు అందజేశారు. పాత్రికేయ విలువల ను ప్రభుత్వం కాపాడాలని దాడులు ఆపాలని పాత్రికేయులకు ఇల్లు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పాత్రికేయులు పాల్గొన్నారు.