calender_icon.png 30 August, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆకస్మిక తనిఖీ

30-08-2025 12:00:00 AM

మహదేవపూర్,(భూపాలపల్లి) ఆగస్టు 29 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు, రికార్డుల పరిశీలన, ఫార్మసీ (మందులు) కుక్క కాటు ఇంజక్షన్లు,  పాముకాటు ఇంజక్షన్లు, నిల్వ ఉన్నవా లేవా అని పరిశీలించారు.

ఓపి విభాగాల్లో ఏ రకాల వ్యాధుల వారు ఆసుపత్రికి వస్తున్నారు, రికార్డులు పరిశీలించారు. వర్షకాలం నేపథ్యంలో రోడ్లు వంతెనలు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, ముందుగానే గర్భిణీ స్త్రీలను 15 రోజుల లోపు డెలివరీ కున్న గర్భిణీ స్త్రీలను మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి లేదా జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సిబ్బందికి సూచించారు.  పిఓఎన్డిసి డాక్టర్ సందీప్, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ జగదీష్ కన్నా, డి డి ఎం, మధుబాబు, హెచ్‌ఈఓ, సోనాజీ, హెచ్ వి, లక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, చంద్రమోహన్ ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.