జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశం
ఏర్పాట్లను పరిశీలించిన మాగంటి సునీత
జూబ్లీహిల్స్, జూలై 2(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 5న తెలంగాణ భవన్ లో నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరగనుంది. అందులో భాగంగా ఎస్‌ఐఆర్ పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాగంటి సునీత గోపీనాథ్ బిఆర్‌ఎస్ భవన్లో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం స్వయంగా పర్యవేక్షించారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వసతులపై అక్కడ ఉన్న నాయకులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాగంటి సునీత మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు సదస్సుకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజవర్గంలో పార్టీ బలోపేతానికి, రాబోయే కార్యక్రమాల దిశానిర్దేశానికి ఈ సమావేశం ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన సీనియర్ నాయకులు, ముఖ్య నేతలు, క్రియాశీలక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






