3 July, 2026 | 1:09 AM

బకాయిలు విడుదల చేయాల్సిందే

03-07-2026 12:00 AM

లేకుంటే ఉద్యమం ఉధృతం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పీయూలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హెచ్చరిక

ముషీరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం ఉధృతం అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హెచ్చరించారు.

పాలమూరు యూనివర్సిటీలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీజు రీయింబర్స్మెంట్ సాధన దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యను సామాజిక న్యాయ సాధనంగా తీర్చిదిద్దామని ఇచ్చిన హామీలు ఆచరణలో బలహీన పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి గౌడ్, నాగర్కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు జగన్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారస్వామి, నాన్-టీచింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామ్మోహన్, జీబీసీ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నగర్, మాజీ డీఈఓ విజయ్ కుమార్, సారంగి లక్ష్మీకాంత్, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్, స్వేరో రాష్ట్ర అధ్యక్షుడు పవన్, లంబాడి హక్కుల సమితి అధ్యక్షుడు సాయి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శివాజీ, వివిధ బీసీ విద్యార్థి సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు, ప్రొఫెసర్లు, సామాజిక సంస్థల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.