06-10-2025 12:22:09 AM
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి
ముషీరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాదవులకే సీటు కేటాయించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాద వ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా టీఆర్ పీ ప్రధాన కార్యదర్శి వట్టే జానకయ్య యాదవ్ ను సమితి ఘనంగా సత్కరించింది. అనంతరం సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న యాదవులకు నామినేటేడ్ పదవుల్లో 3 ఎమ్మెల్సీలు, చైర్మన్ పదవులు, డైరెక్ట ర్లు ఇవ్వాలని కోరారు. అలాగే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో యాదవులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, లేని పక్షంలో యాదవుల సత్తా ఎంటో ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు.
యాదవ కార్పోరే షన్‌ను ఏర్పాటు చేసి రు.100 కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. సంఘం రాష్ట్ర నాయకులు దేవేందర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ , సింహ యాదవ్, నక్కా శ్రీనివాస్ యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.