calender_icon.png 12 September, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మృతి వనాన్ని ప్రారంభించిన జూపల్లి

12-09-2025 12:32:33 AM

ఆదిలాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): అమరవీరుల స్మారకార్థం ఆదిలా బాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రూ.కోటితో ఏర్పాటు చేసిన స్మృతి వనాన్ని గురువారం  మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కోవ లక్ష్మి, ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తాతో కలిసి  ప్రారంభించారు. అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద మంత్రి నివాళులర్పిం చారు.

అనంతరం గిరిజన సంక్షేమ శాఖ, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ  ఉట్నూర్, ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల విలువ గల ట్రైకార్ యూనిట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత జైనథ్ మండలంలో పర్యటించారు. పిప్పర్‌వాడలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి లబ్ధ్దిదారులతో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేయించారు.

ఈ సందర్భంగా లబ్ధ్దిదారులకు నూతన వస్త్రాలు సమర్పించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విట్టల్, డీసీసీబీ చైర్మన్ అడ్భోజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు.