10-11-2025 12:25:22 AM
బాన్సువాడ కోర్టు జడ్జి భార్గవి
బాన్సువాడ, నవంబర్ 9 (విజయక్రాంతి): అందరికీ న్యాయం అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించినట్లు బాన్సువాడ కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి అన్నారు. ఆదివారం న్యాయ సేవ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో న్యాయ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి భార్గవి మాట్లాడుతూ అందరికీ న్యాయం అందుబాటులో న్యాయం నినాదంతో ప్రజలకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో న్యాయచైతన్య సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. అందరికీ న్యాయం అందుబాటులో న్యాయం నినాదంతో ప్రజలకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సేవా సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సలహాలు ప్రభుత్వ న్యాయవాదుల సాయం మధ్యవర్తిత్వంతో సమస్యల పరిష్కారం పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సు రాములు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.