calender_icon.png 10 November, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

10-11-2025 12:22:30 AM

ఎస్సు బొజ్జ మహేష్ 

ఎల్లారెడ్డి, నవంబర్ 9 (విజయ క్రాంతి): విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని ఎల్లారెడ్డి ఎస్‌ఐ బొజ్జ మహేష్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్సి బాలికల వసతి గృహంలో నేషనల్ లీగల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సు మహేష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు వారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా కష్టపడి చదవడంతో పాటు న్యాయ సలహాలు, సూచనలు పాటించడంతోపాటు తమ చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులకు బంధువులకు న్యాయ వ్యవస్థపై చట్టాల పై అవగాహన కల్పించాలన్నారు.

మున్సిప్కోట్ న్యాయవాది పద్మ పండరి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోపాటు ఉన్నత లక్ష్యాలు నేర్పరచుకొని జీవితంలో స్థిరపడే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయ వాదులు, విద్యార్థినీలు, వసతి గృహ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.