calender_icon.png 13 May, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారుల విస్తరణతో అభివృద్ధికి బాటలు

13-05-2025 12:02:37 AM

మెదక్ ఎంపీ రఘునందన్రావు ఎన్హెచ్-65 విస్తరణపై సమీక్ష 

సంగారెడ్డి, మే 12(విజయక్రాంతి): జాతీయ రహదారుల విస్తరణతో జిల్లా అభివృద్ధికి బాటలు పడతాయని మెదక్ ఎంపీ ఎం.రఘునందన్రావు  అన్నారు. జి ల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి 65 విస్తరణ పనులపై సమీక్ష సమా వేశం జరగింది.

ఈ సమావేశానికి ఎంపీ అధ్యక్షత వహించారు. బీహెచ్‌ఈఎల్ రో డ్డు నుంచి పోతారెడ్డిపేట వరకు హైవే విస్తరణ పనుల్లో జాప్యం, భూసేకరణ సమస్యలు, విభిన్న శాఖల సమన్వయ లోపాలు వంటి అంశాలపై ఈ సమీక్షలో చర్చ నిర్వహించారు. జాతీయ రహదారుల ఏర్పాటుతో పరిశ్రమలు రావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని అన్నా రు.

సమృద్ధిగా నీరు, విద్యుత్ సౌకర్యం, రవాణా సదుపాయం, సరైన సమాచార వ్యవస్థ ఉన్నట్లయితే ఆ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసు కుంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం ద్వారా ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, జాతీయ రహదారుల నిర్మాణంలో అవసరమైన మట్టిని చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల నుండి ఉచితంగా తీసుకోవడం ద్వారా ఆయా ప్రాంతాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, ఎన్హెచ్‌ఏఐ ఇంజినీర్లు, మెట్రో, విద్యుత్, అగ్నిమాపక, వాటర్ గ్రిడ్, పంచాయతీ రాజ్,రెవెన్యూ, మిషన్ భగీరథ, పోలీసు శాఖల అధికారులుపాల్గొన్నారు.