17-05-2025 01:06:20 AM
-ప్రభుత్వానికి అమ్ ఆద్మీ పార్టీ విజ్ఞప్తి
ఖైరతాబాద్; మే 16 (విజయ క్రాంతి) : దా ప్యూరో పాల్ ఐటీ కంపెనీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేసిందని బాధితులకు త్వరగా న్యాయం చేయాలని పార్టీ నాయకులు విజయకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు సూర్య తేజ్ త కలిసి మాట్లాడారు.. కొందరు వ్యక్తులు మాదాపూర్ లో ప్యూరోఫాల్ స్కిల్ హబ్ పేరుతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మూడు నెలల ట్రైనింగ్ ఇచ్చి తరువాత ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికారని తెలిపారు.
ఒక్కొక్కరి వద్ద రెండున్నర లక్షలు వసూలు చేసి దాదాపు 200 మందికి పైగా నిరుద్యోగ యువతులను మోసం చేసిందని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ తో కాలయాపన చేస్తూ నెలలు గడుస్తున్న తమ అకౌంట్లో జీతాలు పడకపోవడంతో మోసపోయామని గ్రహించిన తాము గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.