05-05-2025 02:25:20 AM
తెలంగాణ హైకోర్టులో సిట్టింగ్ జడ్జిగా విధులు
హైదరాబాద్, మే 4: తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని ఆదివారం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియదర్శిని హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ప్రియదర్శిని హఠాన్మరణంతో న్యాయవాద వర్గాల్లో విషాదం నెలకొంది. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
2008 మధ్య కాలంలో అనేక జిల్లా కోర్టులకు జడ్జిగా విధులు నిర్వర్తించారు. విశాఖకు చెందిన గిరిజా ప్రియదర్శిని ఎన్‌బీఎం న్యాయ కళాశాలలో విద్యను అభ్యసించారు. ఏపీకి చెందిన గిరిజా తెలంగాణలో కూడా పలు కోర్టుల్లో విధులు నిర్వర్తించారు. లోక్ అదాలత్‌లు నిర్వహించడం ద్వారా వేలాది పెండింగ్ కేసులను ఆమె పరిష్కరించారు. సుప్రీం కోర్టు కొలీజియం 2022లో గిరిజా ప్రియదర్శినిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది.