calender_icon.png 5 May, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసేమియా చిన్నారులకు మెగా రక్తదాన శిబిరం

05-05-2025 02:24:12 AM

ఐవీఎఫ్ సేవ దళ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా

కామారెడ్డి, మే 4 (విజయ క్రాంతి), చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్త సేకరణ కోసం త్వరలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జాతీయ ఐ వి ఎఫ్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఆదివారం 53వ జన్మదిన సందర్భంగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖ హైదరాబాద్ రేంజ్ డిఐజి దుద్దేల శ్రీనివాస్ మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ముందుకు వచ్చిన వారందరికీ ప్రశంస పత్రాలను, స్టీల్ వాటర్ బాటిల్స్ ను అందజేయడం జరిగింద అన్నారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వాణకు కృషి చేసిన ఐ వి ఎఫ్ రాష్ట్ర చైర్మన్, డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదా త లా సమూహం అధ్యక్షుడు జమీల్ హైమద్, ఉపాధ్యక్షులు వెంకటరమణ, వాసవి క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కార్యదర్శి ఉప్పల సాయినాథ్, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, మాజీ డిప్యూటీ గవర్నర్ అంతర్జాతీయ వాసవి క్లబ్ కోఆర్డినేటర్ భాషెట్టి నాగేశ్వరరావు, బచ్చు చంద్రశేఖర్, యాదగిరి, రెడ్డి శెట్టి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.